Site icon NTV Telugu

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. కొత్త పథకం ద్వారా 9.75 లక్షల ఉద్యోగాలు..!

Anurag Thakur

Anurag Thakur

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది… ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీలో.. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం లభించింది.. ఈ సంస్కరణ రవాణా రంగానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరిస్తుంది, చివరి-మైల్ డెలివరీని వేగవంతం చేస్తుంది మరియు వ్యాపారాలకు డబ్బు ఆదా చేస్తుందని.. ఈ నెల 17న ప్రధానమంత్రి మోడీ.. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ విధానం లాజిస్టిక్స్ సేవల్లో ఎక్కువ సామర్థ్యం కోసం యులిప్, స్టాండర్డైజేషన్, మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రవేశపెడుతుందని.. కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.. లాజిస్టిక్స్ పనితీరు సూచిక ర్యాంకింగ్‌ను మెరుగుపరచడం మరియు 2030 నాటికి టాప్ 25 దేశాలలో ఒకటిగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

Read Also: Heartbreaking video: వైరల్‌గా మారిన పెద్దాయన వీడియో.. కంటతడి పెట్టిస్తోంది..!

ఈ పాలసీ లాజిస్టిక్స్ సెక్టార్ కోసం విస్తృతమైన ఇంటర్ డిసిప్లినరీ, క్రాస్ సెక్టోరల్, మల్టీ-జ్యూరిస్డిక్షనల్ మరియు కాంప్రెహెన్సివ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశిస్తుందని.. 2030 నాటికి గ్లోబల్ బెంచ్‌మార్క్‌లతో పోల్చదగిన విధంగా భారతదేశంలో లాజిస్టిక్స్ ధరను తగ్గించడం, లాజిస్టిక్స్ పనితీరు సూచిక ర్యాంకింగ్‌ను మెరుగుపరచడం, 2030 నాటికి టాప్ 25 దేశాలలో ఒకటిగా ఉండేలా చేయడం.. సమర్థవంతమైన లాజిస్టిక్స్ కోసం డేటా ఆధారిత నిర్ణయ మద్దతు యంత్రాంగాన్ని రూపొందించడం వంటి లక్ష్యాలను పాలసీ కలిగి ఉందన్నారు.. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పరిశ్రమల వాటాదారులు మరియు విద్యాసంస్థలతో అనేక రౌండ్ల సంప్రదింపులు జరిపిన తర్వాత అభివృద్ధి చేయబడింది. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్‌ల గురించి తెలుసుకుంటుందన్నారు..

కాగా, లాజిస్టిక్ సెక్టర్‌లో 20కిపైగా ప్రభుత్వ ఏజెన్సీలు, 40 పార్టనర్ గవర్నమెంట్ ఏజెన్సీలు, 37 ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్, 500 సర్టిఫికేషన్లు, 10,000కుపైగా కమోడిటీస్, 160 బిలియన్ డాలర్ల మార్కెట్ సైజ్ ఉన్నాయి. దీనిలో 200 షిప్పింగ్ ఏజెన్సీలు, 36 లాజిస్టిక్స్ సర్వీసెస్, 129 ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, 166 కంటెయినర్ ఫ్రెయిట్ స్టేషన్స్, 50 ఐటీ ఎకోసిస్టమ్స్, బ్యాంకులు, బీమా సంస్థలు ఉన్నాయి. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ సెక్టర్లో 22 మిలియన్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరోక్ష లాజిస్టిక్స్ ఖర్చులు 10 శాతం తగ్గే విధంగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ నూతన విధానం లక్ష్యం. దీనివల్ల ఎగుమతులు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ది చెందుతాయని అంచనా.

ఇక, దేశీయ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఈ ప‌థ‌కంతో 1,95,000 మందికి నేరుగా ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయి… మ‌రో 7,80,000 మందికి ప‌రోక్షంగా ఉద్యోగ అవ‌కాశాలు లభిస్తాయని… అంచనా వేస్తున్నారు.. శ‌క్తివంత‌మైన సోలార్ పీవీ మాడ్యుల్స్ రూప‌క‌ల్పనలో ప‌రిశోధ‌న‌ల‌కు ప్రోత్సాహ‌కం కోసం ఈ పథ‌కం తీసుకొచ్చారు.. సెమికండ‌క్టర్ల అభివృద్ధి కార్యక్రమంలో మార్పుల‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఇండియాలో సెమికండ‌క్టర్ల యూనిట్ స్థాపిస్తే 50శాతం పెట్టుబ‌డి ఖ‌ర్చుకు కేంద్రం సాయం చేయనుంది.. సౌరశక్తి ప్లాంట్ల కోసం కేంద్ర ప్రభుత్వం 19,500 కోట్లు మంజూరు చేసింది. 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పీఎల్‌ఐ స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే పీఎల్‌ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు. సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Exit mobile version