NTV Telugu Site icon

Delhi: మెట్రో, ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Metro

Metro

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్టుల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.

దాదాపు రూ.34,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పూణె, థానే, బెంగళూరు మెట్రో ప్రాజెక్ట్ సౌకర్యాల కోసం ఆమోదం తెలిపింది. థానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, పూణె మెట్రో ఫేజ్-1, బెంగళూరు మెట్రో ఫేజ్-3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు మంత్రి తెలిపారు.

బెంగళూరు మెట్రో ఫేజ్-3 నిర్మాణంలో భాగంగా 44.65 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020 నాటికి ఫేజ్-3 మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నారు. బెంగళూరు మెట్రో రైలు ప్రాజక్టుకు రూ.15,611 కోట్లను కేంద్రం కేటాయించింది. థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.12,200.10 కోట్లు కేటాయించారు. 22 స్టేషన్లను కలుపుతూ 29 కిలోమీటర్ల కారిడార్‌గా దీనిని రూపొందిస్తు్న్నారు. పూణె మెట్రో ఫేజ్-1ను 5.46 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. మూడు అండర్‌గ్రౌండ్ స్టేషన్లు కూడా ఇందులో ఉంటాయి. రూ.2,945.53 కోట్లు ఇందుకు కేటాయిస్తున్నారు. 2029 ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కాగా, పాట్నాలోని బిహాతా, పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగరాలో రూ.2,962 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.