Site icon NTV Telugu

రైతులకు గుడ్‌న్యూస్‌.. ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు

Narendra Singh Tomar

Narendra Singh Tomar

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర కేబినెట్… ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. నువ్వుల ధర క్వింటాలుకు రూ. 452, కంది, మినప పప్పు ధరలు క్వింటాలుకు రూ. 300 చొప్పున పెంచగా.. వేరుశనగ క్వింటాలు ధర రూ. 275 చొప్పున, వరికి రూ.1940 పెంచినట్లు మీడియాకు వివరించారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. కాగా, గత సంవత్సరం ఆమోదించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

Exit mobile version