Railway Stocks: కేంద్రం పార్లమెంటులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రైల్వేకు సంబంధించిన అన్ని కంపెనీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్, రైల్ టెల్ లిమిటెడ్, ఐఆర్‌సీటీసీ తదితర షేర్‌లు నాలుగు శాతానికి పైగా లాభాల్లోకి వచ్చాయి. అలాగే, జూపిటర్ వాగన్స్ షేర్స్ ఏకంగా 19.67 శాతం లాభాలను ఆర్జించగా.. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ 13.27 శాతం మేర లాభాలను పొందాయి. టెక్స్మాకో రైల్ మరియు ఇంజనీరింగ్ కంపెనీ 3.6 శాతం లాభ పడింది. అయితే, బడ్జెట్‌కి ముందు లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత 400 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్.. 135 పాయింట్లు డౌన్ అయినా నిఫ్టీ.
Railway Stocks: బడ్జెట్ సెషన్స్ వేళ లాభాల్లో రైల్వే స్టాక్స్..
- పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్..
- భారీ లాభాల్లో ట్రేడవుతున్నా రైల్వే స్టాక్స్..