Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘బైడెన్, మోడీలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు’’.. తప్పుపట్టిన ఫారెన్ మినిస్ట్రీ..

Rahul

Rahul

Rahul Gandhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జో బైడెన్, ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ఎగతాళి చేయడాన్ని దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అమెరికాతో భారత్‌కి ఉన్న బంధాలకు అనుగుణంగా ఆయన వ్యాఖ్యలు లేవని చెప్పింది. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.

Read Also: Supreme Court: “రిలేషన్‌షిప్ చెడిపోవడం ఆత్మహత్యను ప్రేరేపించదు..”

‘‘భారతదేశం, యూఎస్‌తో బహుముఖ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ భాగస్వామ్యాన్ని ఇరు పక్షాలు ఐక్యత, పరస్పర గౌరవం, నిబద్ధతతో ఏళ్ల తరబడి నిర్మించాయి. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం, అవి స్నేహపూర్వక సంబంధాలకు అనుగుణంగా లేవు. ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వ స్థానానికి ప్రాతినిధ్యం వహించదు’’ అని జైస్వాల్ బదులిచ్చారు.

ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అమరావతిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని నరేంద్రమోడీ “జ్ఞాపకశక్తి లోపం”తో బాధపడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వైద్యనిపుణులు కూడా విమర్శించారు. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఇలాంటి ప్రకటనలు తప్పుడు సమాచారాన్ని శాశ్వతం చేసే ప్రమాదం ఉందని, రాహుల్ గాంధీ ఒక విదేశీ నేత గురించి ఇలా వ్యాఖ్యానించడం నిరాశ పరిచిందని, మన పెద్దలను గౌరవించే భారతీయ తత్వానికి ఇది సరైనంది కాదని, ప్రతిపక్ష నాయకుడికి ఇది తగినది కాదని నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ భారత్ (ఎన్‌ఎంఓ-భారత్) అధ్యక్షుడు సిబి త్రిపాఠి సోనియాగాంధీకి లేఖ రాశారు.

Exit mobile version