Site icon NTV Telugu

అసెంబ్లీలో హీరో ఫోటోలా…?

తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీ సీరియస్‌ అయింది. ఈ సంఘటనపై మాజీ ఎఐఎడిఎంకె మంత్రి జయకూమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో హీరో ఫోటోలా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలోని న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో ఉదయ్ నిధి స్టాలిన్‌ ఫోటోలు ఎలా పెడుతారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. డిఎమ్‌కె మంత్రులకు అతనిపై భక్తి ఉంటే వాళ్ళు పూజ రూంలో పెట్టుకుని పూజలు చేసుకోండి, పబ్లిక్ ప్రాపర్టీ అయినా అసెంబ్లీలో కాదని ఆయన మండిపడ్డారు. అక్కడ ఫోటోలు కేవలం ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులకు చెందినవి మాత్రమే ఉండాలని మాజీ ఎఐఎడిఎంకె మంత్రి జయకూమార్ హితవు పలికారు.

Exit mobile version