Site icon NTV Telugu

Tamilnadu: త్వరలోనే మంత్రి కాబోతున్న యువ హీరో

Udayanidhi Stalin

Udayanidhi Stalin

తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ మరికొద్దిరోజుల్లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లోకి రాబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు డీఎంకే నేతలు ఈ వార్తలు నిజమే అని ధృవీకరిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ప్రజాదరణ పొందారని.. చాలామంది మంత్రులు తమ కార్యక్రమాల్లో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని పలువురు వెల్లడిస్తున్నారు.

అటు అసెంబ్లీలో కూడా ఉదయనిధి స్టాలిన్‌కు ఇతర ఎమ్మెల్యేల నుంచి మంచి గౌరవం అందుతోందని డీఎంకే ఎమ్మెల్యేలు స్వయంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నలుగురు వ్యక్తులు ఉన్నారని.. అలాంటప్పుడు క్రౌడ్ ఫుల్లింగ్ ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రి చేయడంలో తప్పు లేదని కొందరు డీఎంకే నేతలు భావిస్తున్నారు. 1989 నుంచి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ పార్టీ యువజన విభాగంలో ఒక్కరికైనా మంత్రి పదవి దక్కుతోందని.. అయితే ఈసారి యువజన విభాగం నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్‌కు ఇవ్వడమే సరైందని సూచిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో చెపాక్ నుంచి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Prashant Kishor: సంచలన నిర్ణయం.. స్వంత కుంపటి?

Exit mobile version