Site icon NTV Telugu

Two Women’s Married:మగాళ్లంటే ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Untitled Design (2)

Untitled Design (2)

మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతో ఇద్దరు యువతులు ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సంప్రదాయాలకు భిన్నంగా జరిగిన ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

బీహార్‌లోని సుపౌల్ జిల్లాకు చెందిన పూజా (21), కాజల్ (18) అనే ఇద్దరు యువతులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఒకే ఆలోచనలు, అభిరుచులతో దగ్గరైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి తమ బంధం చేరుకుందని వారు తెలిపారు.

మగాళ్లపై తమకు ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పిన ఈ యువతులు, కుటుంబ సభ్యుల వ్యతిరేకించినప్పటికి పరస్పర అంగీకారంతో సుపౌల్ జిల్లాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఒక షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

Exit mobile version