Site icon NTV Telugu

UP: కోర్టు హాల్‌లో లాయర్‌ను చితకబాదిన మహిళలు.. అసలేం జరిగిందంటే..!

Upfight

Upfight

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్‌లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బస్తీ సివిల్ కోర్టు హాల్ నుంచి ఒక లాయర్ బయటకొస్తున్నాడు. ఇంతలో మహిళలు అడ్డగించి భౌతికదాడికి దిగారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏప్రిల్ 3న (గురువారం) ఈ ఘటన చోటుచేసుకుంది. లాయర్‌ కూడా అంతే ధీటుగా మహిళలపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మిగతా లాయర్లంతా జోక్యం పుచ్చుకుని విడదీశారు.

ఫోన్‌లో లాయర్ దుర్భాషలాడినట్లుగా ఒక మహిళ ఆరోపించింది. అతనితో మాట్లాడేందుకు వచ్చి గొడవకు దిగారు. అనంతరం కొట్లాటకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

ఇద్దరు మహిళలపై న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మహిళలపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కూడా పోలీసులను డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Exit mobile version