Two stab man to death for not repaying loan of Rs 9k in Karnataka’s Kalaburagi: కర్ణాటకలో దారుణం జరిగింది. కేవలం రూ. 9000 కోసం ఒకరిని హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. అప్పుగా ఇచ్చిన మొత్తం చెల్లించకపోవడంతో హత్య చేశారు నిందితులు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కలబురిగిలో రద్దీగా ఉండే రోడ్డుపైనే ఓ వ్యక్తిని ఇద్దరు అత్యంత దారుణంగా పొడిచి చంపారు. కలబురిగికి చెందిన జమీర్ తనకు తెలిసిన సమీర్ నుంచి రూ. 9,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే కొంత కాలంగా జమీర్ ని తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా జమీర్ కోరుతున్నాడు. అయితే అప్పటి నుంచి జమీర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం జమీర్ కలబురిగిలోని జేవర్గి రోడ్డు దాటుతుండగా.. సమీర్ తన స్నేహితుడు ఆకాశ్ తో కలిసి పదునైన ఆయుధంతో దాడి చేశారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. జమీర్ పై సమీర్ దాడి చేయడం ప్రారంభించిన వెంటనే జమీర్ అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగులు తీశాడు. అయితే ఆకాష్, సమీర్లు ఇద్దరు జమీర్ ను పట్టుకుని బలంగా కొట్టారు. తీవ్రగాయాలైన జమీర్ అక్కడిక్కడే మరణించారు. ఘటన అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. అయితే నడిరోడ్డుపై ఓ వ్యక్తి చంపుతున్నా.. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నా.. ఒక్కరు ఆపేందుకు ప్రయత్నించలేదు.
