Site icon NTV Telugu

Janmashtami: జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి

Mathura Temple

Mathura Temple

Janmashtami: శుక్రవారం జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గల ఓ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా రద్దీ కారణంగా ఇద్దరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బాంకే బిహారీ ఆలయంలో అర్ధరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

“జన్మాష్టమి శుభ సందర్భంగా భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. హారతి సమయంలో ఒక్కసారిగా ప్రజలు కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఇద్దరు భక్తులు ఊపిరాడక మరణించారు.” అని మధురలోని సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ చెప్పారు. ఆరుగురికి కూడా గాయాలయ్యాయని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

Uttarakhand: డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

మధుర శ్రీకృష్ణుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

Exit mobile version