NTV Telugu Site icon

Maha Kumbh Mela: వసంత పంచమి ఎఫెక్ట్.. ఒక్కరోజే 2 కోట్ల మంది స్నానాలు

Maha Kumbh Mela

Maha Kumbh Mela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఇక సోమవారం వసంత పంచమి కారణంగా భక్తులు అంతకంతకు రెట్టింపుగా తరలివచ్చారు. ఇక మౌని అమవాస్య రోజున జరిగిన తొక్కిసలాట తర్వాత యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడే పోలీస్ బందోబస్తును పట్టిష్టం చేశారు. ఫిబ్రవరి 3 సాయంత్రం 4 గంటల వరకు గంగా, యమునా , పౌరాణిక సరస్వతి సంగమం దగ్గర సుమారు రెండు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం చేశారని యూపీ సర్కార్ తెలిపింది. రాత్రి వరకు దాదాపు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 34.97 కోట్ల మంది భక్తులు వచ్చారని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..

మౌని అమావాస్య రోజున అత్యధికంగా ఒకేరోజు ఎనిమిది కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. మకర సంక్రాంతి జనవరి 14 నాడు 3.5 కోట్ల మంది.. జనవరి 30, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు కోట్ల మందికి పైగా భక్తులు, పౌష్ పూర్ణిమ జనవరి 13 నాడు 1.7 కోట్ల మంది స్నానాలు చేశారు. మూడో అమృత స్నానం సోమవారం, ఫిబ్రవరి 3న రెండు కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు.

ఇది కూడా చదవండి: YSRCP: ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ.. కారణం ఇదే..!