Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్‌ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్

  • ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్‌ సింగ్‌కు షాక్
  • న్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్
  • 10 రోజుల తర్వాత కోర్టులో లొంగిపోయిన సమర్థ్‌ సింగ్
Twisha Sharma9

Twisha Sharma9

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్ సింగ్‌ను తక్షణమే న్యాయ వృత్తి నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సస్పెండ్ చేసింది. ఈ కేసులో వరకట్న వేధింపులు, క్రూరత్వం తదితర ఆరోపణలపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ కేసులో నిందితుడైన న్యాయవాది దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొంది.

న్యాయవాది సమర్థ్‌సింగ్‌పై ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని బార్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఘటన న్యాయవాద వృత్తి గౌరవం, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమని పేర్కొంది.

×
×
Ad

ఇప్పటికే ట్విషా శర్మ కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.