రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సందడి చేశాడు. గ్రాండ్ సంగీత్‌లో బాలీవుడ్ హీరోలు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ వంటి సినీ ప్రముఖులతో కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. స్నేహితురాలు బెట్టినా ఆండర్సన్‌తో కలిసి ట్రంప్ జూనియర్ నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఇండియన్-అమెరికన్ బిలియనీర్ కుమార్తె నేత్ర మంతెన వివాహం ఉదయపూర్‌లోని వంశీ గదిరాజుతో జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు బాలీవుడ్ ప్రముఖులు రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ సంగీత్‌లో తళుకున మెరిశారు. రణ్‌వీర్ గల్లీ బాయ్ సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా పాటను పాడి వివాహ వేదికను ఉత్సాహంగా మార్చాడు. ఉదయపూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వివాహానికి ప్రముఖులు, బిలియనీర్లు, అంతర్జాతీయ వీఐపీలు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భారతీయ కళాకారులు పాల్గొనగా.. జస్టిన్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్ వంటి ప్రపంచ కళాకారులు కూడా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇక అనంత్ అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం మేరకు ట్రంప్ జూనియర్ గురువారం గుజరాత్‌కు వెళ్లారు. జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంటారా వన్యప్రాణాలు కేంద్రాన్ని సందర్శించారు. అలాగే సమీపంలోని ఒక దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో కలిసి ట్రంప్ జూనియర్ దాండియా ఆడారు. అంతకముందు తాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత ప్రపంచంలోనే గొప్ప అద్భుతాల్లో ఒకటి అని ట్రంప్ జూనియర్ అభివర్ణించారు. ఇక జామ్‌నగర్‌లో కార్యక్రమాలు ముగించుకుని ఉదయ్‌పూర్ పెళ్లికి వెళ్లిపోయారు.
