H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాదారులకు షాక్ ఇచ్చారు. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో ఆందోళన పెంచాయి. అమెరికాలో పనిచేస్తున్న H-1B వీసాదారుల్లో 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరంతా, కొత్తగా H-1B వీసాలు అప్లై చేసుకోవాలనుకున్నా, దానిని రెన్యూవల్ చేయించుకోవాలన్నా రూ. 88 లక్షలు కాట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. H-1B వీసా లాటరీ సిస్టమ్‌ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించారు.
ఎవరిపై ప్రభావం ఉండదు..
* అమెరికాలో ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వారిపై ప్రభావం ఉండదు.
* అమెరికాలో ఉన్న H-1B వర్కర్లపై ప్రభావం ఉండదు.
* అమెరికాలోని H-1B ట్రాన్స్‌ఫర్లపై ప్రభావం ఉండదు.
* అమెరికాలో H-1B పొడగింపుపై ప్రభావం ఉండదు.
* H-1B స్టాంప్ చెల్లుబాటులో ఉన్నవారిపై ప్రభావం ఉండదు.
* అమెరికాలో ఉండి H-1Bకి స్టేటస్ మార్చుకునే వారు.
* విదేశాలకు వెళ్లి, H-1B స్టాంప్ వాలిడిటీ ఉంటే, ప్రభావం ఉండదు.
ఎవరిపై ప్రభావం ఉంటుంది..
* విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వారిపై ప్రభావం ఉంటుంది.
* H-1B గడువు ముగిసిన వారిపై ప్రభావం.
* కొత్తగా H-1B అప్లై చేసుకున్నవారిపై ప్రభావం.
* విదేశాల్లో ఉండి H-1Bకి స్టేటస్ మార్చుకునే వారిపై ప్రభావం.
* విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వారిపై ప్రభావం
