Site icon NTV Telugu

Trump vs Modi: భారత్ దెబ్బకు.. దారికొస్తున్న ట్రంప్ మావా

Trump

Trump

Trump vs Modi: భారతదేశంపై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాచికలు పారడం లేదు. ఇప్పటికే మన దేశంపై 50 శాతం టారిఫ్స్ వేసినా ఇండియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రష్యాతో ఉన్న స్నేహంతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచేసింది. అలాగే డ్రాగన్ కంట్రీ చైనాతోనూ వాణిజ్య సంబంధాలను న్యూఢిల్లీ పునరుద్ధరిస్తోంది. ఇక, ఇవన్నీ మింగుడుపడని డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు దారి కొస్తున్నాడు. వాణిజ్యం విషయంలో భారత్- అమెరికా సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు వస్తాయని అనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Read Also: Lenin : అఖిల్ ‘లెనిన్’ లేటెస్ట్ అప్ డేట్ ?

మరోవైపు, తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ కి ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన భారత్- అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు తమ అధికారులు కృషి చేస్తున్నాయని.. భవిష్యత్తు కోసం న్యూఢిల్లీ- వాషింగ్టన్ కలిసి పని చేయనున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Exit mobile version