NTV Telugu Site icon

Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..

Tripura Elections

Tripura Elections

Assembly Election 2023: ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో 2023 ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 16న, మేఘాలయం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరపుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 2న ప్రకటించనుంది. 2018లో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం మరోసారి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

Read Also: Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి

ఈ మూడు రాష్ట్రాల్లో చెరో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ పదవీ కాలం మార్చి 12న, మేఘాలయం పదవీ కాలం మార్చి 15న, త్రిపుర పదవీ కాలం మార్చి 22న ముగుస్తోంది. హైస్కూల్ పరీక్షలు, భద్రతా బలగాల కదలికలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రూపొందించినట్లు ఈసీ తెలిపింది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలో ఉంది. మేఘాలయంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఉంది.