Site icon NTV Telugu

Gali Janardhan Reddy: ఓఎంసీ కేసులో విచారణ పూర్తి.. మే 6న ఫైనల్ జడ్జిమెంట్

Galijanardhanreddy

Galijanardhanreddy

కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓఎంసీ కేసును సీబీఐ కోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ శుక్రవారం ముగిసింది. ఓఎంసీ కేసులో తుది తీర్పును మే 6న సీబీఐ కోర్టు వెల్లడించనుంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ట్రయల్ పూర్తి చేసింది. ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: MLA Kolikapudi: టీడీపీలో కాకరేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్..

ఓఎంసీ కేసుపై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా విచారణ పూర్తి చేసింది. మే 6న తుది తీర్పు రానుంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులు ఉన్నారు. మొత్తం ఏడుగురు నిందితులపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి: CSK vs RCB: 6155 రోజుల తర్వాత చెపాక్‌లో ఆర్సీబీ విజయం..

ఇక ఇదే కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై 2022లో హైకోర్టు కేసు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ అప్పీల్ చేసింది. 219 మంది సాక్షులను విచారణ జరిపి.. 3337 డాక్యుమెంట్లను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 డిసెంబర్ 7న సీబీఐ కేసు నమోదు చేసింది. 2011లో డిసెంబర్‌లో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొమ్మిది మంది నిందితులపై నాలుగు ఛార్జిషీట్లు వేసింది.

ఇది కూడా చదవండి: CSK vs RCB: పతిరానా ఓవర్లో కోహ్లీ హెల్మెట్‌కు తాకిన బంతి.. విరాట్ రియాక్షన్ చూడండి

Exit mobile version