NTV Telugu Site icon

Kolkata: అమిత్ షాకు కోల్‌కతా వైద్యురాలి తండ్రి లేఖ.. ఏం విజ్ఞప్తి చేశాడంటే..!

Amithshah

Amithshah

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తండ్రి లేఖ రాశాడు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖలో తెలిపారు. తమ కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AP Cabinet: రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. అజెండాలో పలు కీలక అంశాలు

‘‘తాము నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు.. మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో వైద్యురాలి తండ్రి పేర్కొన్నారు. లేఖనుఈ-మెయిల్ ద్వారా హోంశాఖ పంపించారు.

“నేను నా భార్యతో కలిసి పరిస్థితికి సంబంధించి కొన్ని విషయాలను చర్చించడానికి మరియు మీ మార్గదర్శకత్వం మరియు సహాయం కోసం ప్రార్థించడానికి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నేను మీతో మాట్లాడటానికి మరియు సమస్యపై మీ అంతర్దృష్టిని పొందే అవకాశం కోసం నేను నిజంగా కృతజ్ఞుడను. మీ అనుభవం మరియు మార్గదర్శకత్వం అమూల్యమైనదని నమ్ముతున్నాను,”అని లేఖలో పేర్కొన్నాడు.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సంజయ్‌రాయ్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తుంది. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులు నిరసనలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Modi-Purin: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ-పుతిన్ చర్చలు