Darjeeling Tragedy: భారీ వర్షాల కారణంగా పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్ దగ్గర కొండ చరియలు విరిగిపడి 17 మందికి పైగా మృతి చెందారు. వర్ష బీభత్సంతో కొండచరియలు విరిగిపడటంతో డార్జిలింగ్- సిలిగురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, దూదియా దగ్గర బాలసోన్ నదిలోని ఇనప వంతెన కుప్పకూలి పోయింది. దీంతో సిలిగురి – మరిక్‌ను అనుసంధానించే రోడ్డులో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాగా, కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. 717 జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగి పడ్డాయి. సిక్కిం- సిలిగురి మార్గం కూడా బంద్ అయింది. కుంభ వృష్టి వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్ చర్యలకు ఆటంకం కొనసాగుతుంది.
Read Also: Farrukhabad :కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం
అయితే, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలతో ఆకస్మత్తుగా వచ్చే వరదల ధాటికి ఇప్పటికే పలువురు మృతి చెందుతున్నారు. జస్బీర్ బస్తీలో ఒక్కసారిగా వచ్చిన వరదలతో ఆరుగురు చిన్నారులు మరణించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
