NTV Telugu Site icon

సార్వత్రిక సమ్మె వాయిదా వేసిన కార్మిక సంఘాలు

కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కార్ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి కార్మిక సంఘాలు.. ఓవైపు దేశ‌వ్యాప్తంగా ఇంకా క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డంఓ.. మ‌రోవైపు.. ఫిబ్ర‌వ‌రిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ప్రారంభం కానుండ‌డం.. ఇక‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌బోతుండ‌డంతో.. త‌న స‌మ్మెను వాయిదా వేసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.. అయితే, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా త‌ల‌పెట్టిన స‌మ్మె మాత్రం కొన‌సాగుతుంద‌ని.. కాక‌పోతే, ఫిబ్ర‌వ‌రి 23, 24 తేదీల్లో జ‌ర‌గాల్సిన సార్వత్రిక సమ్మెను మార్చి 28, 29 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశాయి కార్మిక సంఘాలు.

Read Also: ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే..!