Site icon NTV Telugu

సిమ్లాకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…ఇదే కార‌ణం…

స‌మ్మ‌ర్ వ‌చ్చింది అంటే ప‌ర్యాట‌కులు హిల్ స్టేష‌న్‌ల‌కు క్యూలు క‌డుతుంటారు.  దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన హిల్ స్టేష‌న్ల‌లో ఒక‌టి సిమ్లా.  గ‌తేడాది క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించారు.  దీంతో స‌మ్మ‌ర్ స‌మ‌యంలో ప‌ర్యాట‌కు పెద్దగా క‌నిపించ‌లేదు.  ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేసింది.  దీంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ‌లో ప‌లు ఆంక్ష‌లు విధించారు.  అయితే, కారోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో సిమ్లాలో ఆంక్ష‌లు స‌డ‌లించారు.  ఉద‌యం నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇచ్చారు.  పాస్‌లు, నెగెటీవ్ స‌ర్టిఫికెట్లు అవ‌స‌రం లేక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు సిమ్లాకు ప‌య‌నం అయ్యారు.  దీంతో ఆదివారం రోజున పెద్ద ఎత్త‌న ప‌ర్యాట‌కులు సిమ్లాకు రావ‌డంతో ప‌ర్యాను వ‌ద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి.  

Exit mobile version