NTV Telugu Site icon

Maoist Leader Chalapati: “భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..

Maoist Leader Chalapati

Maoist Leader Chalapati

Maoist Leader Chalapati: మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న చలపతి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. చలపతి చనిపోవడం భద్రతా బలగాలకు పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఇతడిని రూ. 1 కోటి రివార్డు ప్రకటించిందంటే, ప్రభుత్వం ఇతడికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చెందిన చలపతి అసలు పేరు జయరాం రెడ్డి.

భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు చలపతి సూత్రధారిగా ఉన్నారు. ఇతడికి 8-10 మంది సెక్యూరిటీ ఉంటుంది. ఫిబ్రవరి 2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దాడికి ఇతను సూత్రధారిగా ఉన్నాడు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి సన్నిహితుడు, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్ హిడ్మాకు చలపతి గురువుగా పరిగణించబడుతాడు. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మని దాడి చేసి చంపిన కేసులో కూడా ఇతడి ప్రమేయం ఉంది.

Read Also: Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత

కొంపముంచిన భార్యతో సెల్ఫీ:

చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే అతడి ప్రాణాలను తీసినట్లు తెలిసింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) ‘డిప్యూటీ కమాండర్’ అయిన అతని భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ భద్రతా దళాలకు అతన్ని గుర్తించడంలో సహాయపడింది. మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత స్వాధీనం చేసుకున్న ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ కనుగొనబడింది.