Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఢిల్లీ: ఇవాళ పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మ అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి.. ఇవాళ పద్మ అవార్డులు అందుకోనున్న చిన జీయర్ స్వామి, కీరవాణి

* క‌డ‌ప: ఒంటిమిట్టలో ఆరో రోజుకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు.. రాత్రికి పండు వెన్నెల్లో కోదండ‌రాముని కల్యాణోత్సవం.. ఉద‌యం జ‌గ‌ద‌భిరాముని ఊరేగింపు..

* ఒంటిమిట్టలో శ్రీరాముడి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. 80 వేల మందికి పైగా భ‌క్తులు క‌ళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు.. స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైన కల్యాణవేదిక.

* ఒంటిమిట్టలో కల్యాణం నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. మ‌ధ్యాహ్నం 2 త‌రువాత క‌డ‌ప‌- తిరుప‌తి ప్రధాన ర‌హ‌దారిలో రాక‌పోక‌లు బంద్‌. తిరుప‌తి నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను రాయ‌చోటిమీదుగా క‌డ‌ప‌కు, క‌డ‌ప నుంచి తిరుప‌తి కి వెళ్లే వాహ‌నాలను రాయ‌చోటి మీదుగా దారి మ‌ళ్లింపు.

* నేడు తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రెస్‌ మీట్లు.. పేపర్‌ లీకేజీపై రాజకీయ కుట్రపై మాట్లాడనున్న బీఆర్ఎస్‌ నేతలు

* తిరుపతి: కార్వేటి నగరం మండలంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం.. గౌతమి గోదావరిలో విహరించనున్న స్వామి వారు.. భారీగా ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రావులపాలెంలో పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్న సిద్దార్దరెడ్డి

* శ్రీ సత్య సాయి జిల్లా : హిందూపురం లోని ఇందిరా నగర్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం.

* శ్రీ సత్యసాయి జిల్లా : ఈనెల 7న హిందూపురంకు రానున్న బాలకృష్ణ . ఆలిలాల్ పాఠశాలలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. 8న యువగళం పాదయాత్రలో  పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.

* అనంతపురం : 61వరోజుకు చేరిన నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. నేడు ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర.. పిల్లిగుండ్ల నుంచి ప్రారంభమై.. గొట్కూరు, మణిపాల్ స్కూల్, బ్రాహ్మణపల్లి, రామచంద్రపురం, కమ్మూరు, కూడేరు వరకు సాగనున్న పాదయాత్ర.

* కృష్ణాజిల్లా: ఈరోజు అంగరంగ వైభవంగా జరగనున్న అవనిగడ్డలో వేంచేసి ఉన్న శ్రీలంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సుమారు లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకొనున్న భక్తులు..

* నేడు విజయవాడ రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ మీడియా సమావేశం.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి చేపడుతున్న మలిదశ ఉద్యమకార్యచరణ షెడ్యూల్ ప్రకటన.

* విజయవాడ : నేడు పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరుతూ సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు..

* విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే బాబు జగ్జీవన్ రామ్ 115 వ రాష్ట్ర స్దాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్న మంత్రి మేరుగు నాగార్జున..

* శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటన.. ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం రూరల్ మండలం, ఎస్.ఎస్ వలస, అలికాం, బైరి వాని పేట, నైరా, బట్టేరు, పొన్నాం, చింతాడ, కె. మన్నయ్య పేట, గేదల వాని పేట,చెందిన లబ్ధిదారులతో వైయస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్ మంత్రి

* కరీంనగర్: అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బండి సంజయ్.. లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు.. సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ జాతీయ నాయకత్వం

* ప్రకాశం : యర్రగొండపాలెంలో బాబు జగ్జీవన్ రాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : గిద్దలూరు మండలం కొంగలవీడులో అంకాల పరమేశ్వరి తిరుణాళ్ల సందర్భంగా మహోత్సవం రాష్ట్ర స్థాయి సీనియర్ విభాగము ఎద్దుల బండలాగుడు పోటీలు..

* బాపట్ల : చీరాలలో శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం..

* ప్రకాశం : చీమకుర్తి హరిహర క్షేత్రం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హాజరుకానున్న విశాఖ శారద పీఠ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి శిద్దా రాఘవరావు..

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి వేణు

* బాపట్ల : కారంచేడులో దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్ బాబు అంత్యక్రియలు, సినీ నటులు వెంకటేష్, రానా, నాగచైతన్య హాజరయ్యే అవకాశం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాబు జగజీవన్ రావు విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.అనంతరం తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* విశాఖ: నేడు TDP జోన్-1 క్లస్టర్ సమావేశం… బూత్ లు వారీగా 34అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష.. నేటి మధ్యాహ్నం నగరానికి రానున్న చంద్రబాబు..

* పల్నాడు: రేపు చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన … ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్, జగన్..

* పల్నాడు: రేపు నడికుడి రైల్వే స్టేషన్ ను పరిశీలించనున్న దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం, పలువురు సేఫ్టీ విభాగం అధికారులు …

* శ్రీకాకుళంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్ వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ లో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు… 12 గంటలకు శ్రీకాకుళం బలగ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పొందూరు మార్కెట్ యార్డులో మూడో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారు.

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ మలయస్వామి,శ్రీరాముల వారు, శ్రీకృష్ణ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు.. రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పున:రుద్దరణ

* తిరుమల: ఇవాళ ,రేపు తుంభూర తీర్ద ముక్కోటి.. రేపు మధ్యహ్నం వరకు భక్తులను తుంభూర తీర్దానికి అనుమతించనున్న టిటిడి

Exit mobile version