మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం భౌతికకాయం విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉంచారు. వేలాది మందిగా ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. అంతిమ యాత్ర బారామతిలోని గడిమా ఆడిటోరియం నుంచి బయల్దేరనుంది.
ఇది కూడా చదవండి: TTD Ghee Adulteration Case : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు
ఇక అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, రాష్ట్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. వీఐపీలు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: విశాఖ దక్షిణం కూటమిలో కొత్త మంట.. టీడీపీ కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి..
బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో వస్తుండగా ఎయిర్‌పోర్టుకు 100 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్‌పీపీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
