One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Vote Victory: ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటూ విలువైందే అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన హోరాహోరీ పోరులో తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి శ్రీనివాస సేతుపతి అద్భుత విజయాన్ని అందుకున్నారు. అధికార డీఎంకే (DMK) అభ్యర్థి, సీనియర్ నేత పెరియకరుప్పన్‌పై ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించారు.
నరాలు తెగే ఉత్కంఠ
కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల ఆధిక్యం దోబూచులాడింది. చివరి రౌండ్ ముగిసేసరికి ఇద్దరి మధ్య తేడా అత్యల్పంగా ఉండటంతో అధికారులు రీ-కౌంటింగ్ నిర్వహించారు. తుది ఫలితంలో శ్రీనివాస సేతుపతికి ఒక్క ఓటు ఆధిక్యం లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పెరియకరుప్పన్ (DMK)పై 01 ఓటు మెజార్టీతో శ్రీనివాస సేతుపతి (TVK) విజేతగా నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఒక సామాన్య ఓటరు వేసే ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతటి కీలక మార్పును తీసుకురాగలదో ఈ ఫలితం నిరూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక్క ఓటు తేడాతో తమ అభ్యర్థి గెలవడంతో టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. “ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేయకూడదని, ఆ ఒక్క ఓటే ఇప్పుడు చరిత్ర సృష్టించిందని” వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అతి తక్కువ తేడాతో ఓటమి పాలవ్వడంపై డీఎంకే శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
నిజానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికిలోను చేశాయి. వాస్తవానికి అన్నీ ఎగ్జిట్‌పోల్స్ గుంప్పగుత్తగా అధికార డీఎంకే మళ్లీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పగా, యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకి పట్టం గట్టింది. మే 4న వెలువడిన ఫలితాలు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ టీవీకేకు జనాలు నిరాజనాలు పలికారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నిజానికి ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఓటములను సంభవించి యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేసిన స్థానం సీఎం స్టాలిన్ పోటీ చేసిన కొళత్తురు. డీఎంకేకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం ఓడిపోయారు. ఇదే సమయంలో టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల నుంచి విజయాన్ని అందుకున్నారు. ఈ దఫా తమిళనాడులో జరిగిన ఎన్నికలు ఆ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!