Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- గుంజవాహి అటవీప్రాంతంలో మహిళలపై పులి దాడి
- తునికాకు సేకరించేందుకు వెళ్లిన మహిళలపై దాడి చేసిన పెద్దపులి
- నలుగురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవనోపాధికోసం అడవికి వెళ్లిన మహిళలకు వారి జీవితాలు అక్కడే ముగిసిపోతాయని ఊహించలేదు. తునికాకు సేకరించేందుకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సిందేవాహి తహసీల్‌లోని గుంజవాహి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దారుణ సంఘటన జరిగింది. అడవిలో మాటువేసి ఉన్న ఒక పులి, తునికాకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఘోరంగా దాడి చేసి వారిని చంపేసింది.
నివేదికల ప్రకారం, గుంజవాహి గ్రామానికి చెందిన ఈ మహిళలు, ఎప్పటిలాగే తునికి ఆకులను సేకరించడానికి ఈ ఉదయం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవికి వెళ్లారు. ఆ మహిళలు పనిలో నిమగ్నమై ఉండగా, పొదల్లో నక్కి ఉన్న పులి అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. ఆ పులి ఆ నలుగురు మహిళలను గాయపరిచి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే, స్థానిక పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులు భారీ భద్రతా బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. పులిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
తాజావార్తలు
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!