ఇంటి బయట పడుకున్న వ్యక్తిపై పులి దాడి చేసి, అనంతరం అదే మంచంపై హాయిగా నిద్రపోయిన ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, గోపాల్ కోల్ అనే వ్యక్తి తన ఇంటి బయట మంచం వేసుకుని నిద్రిస్తుండగా, అడవిలో నుంచి వచ్చిన ఓ పులి అతడిపై ఆకస్మికంగా దాడి చేసింది. దాడి అనంతరం ఆ పులి అక్కడే ఉన్న మంచంపై హాయిగా పడుకుని నిద్రపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పులిని పట్టుకుని తిరిగి అడవిలోకి వదిలేశారు. పులి దాడిలో గాయపడిన గోపాల్ కోల్‌ను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.టైగర్ రిజర్వ్‌కు సమీపంలో తమ గ్రామం ఉండటంతో తరచూ పులులు గ్రామంలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.
बांधवगढ़ टाइगर रिजर्व के पास बेलदी गाँव में एक व्यक्ति को घायल कर बिस्तर पर जाकर बैठ गया टाइगर pic.twitter.com/JNtuuTLVr9
— Nitendra Sharma (@nitendrasharma2) December 29, 2025
