Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గామ్‌లో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లని బుద్గామ్‌లో భద్రతా దళాలు లష్కరే తొయిబా ఉగ్రవాదుల ట్రాప్ చేశాయి. వారిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం
ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది లతీఫ్‌తో సహా ఎల్‌ఈటీకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాహుల్ భట్, అమ్రీన్ భట్‌లతో సహా పలు పౌర హత్యల్లో ఉగ్రవాది లతీఫ్ ప్రమేయం ఉందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. చదూరా తహసీల్ కార్యాలయ ఉద్యోగి రాహుల్ భట్‌ను మే 12న అతని కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చిచంపగా, మే 26న బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్‌ను గుర్తు తెలియని ఉగ్రవాదులు చంపారు.
