Site icon NTV Telugu

యూపీ సీఎం యోగికి బెదిరింపులు..

yogi

yogi

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది… స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల్లో యోగిని జాతీయ జెండా ఎగుర‌వేసేందుకు అనుమతించ‌బోమంటూ బెదిరింపులకు దిగారు దుండగులు.. ఈ వ్యవహారం యూపీలో తీవ్ర కలకలమే రేపింది… అంత‌ర్జాతీయ ఫోన్ నెంబ‌ర్ నుంచి యూపీ పోలీసుల‌కు ఫోన్‌ కాల్ వచ్చింది.. జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నీయ‌కుండా సీఎం యోగిని అడ్డుకుంటామని.. థ‌ర్మల్ ప్లాంట్లను మూసివేయాలంటూ.. యూపీ పోలీసుల‌కు ఆడియో మెసేజ్ వ‌చ్చింది. ఈ మెసేజ్‌.. ఎస్ఎఫ్‌జేకు చెందిన గుర్పత్వంత్ సింగ్ ప‌న్నన్ పేరుతో వచ్చిందని చెబుతున్నారు.. ఇక, ష‌హ‌ర‌న్‌పూర్ నుంచి రాంపూర్ వ‌ర‌కూ యూపీలోని ప‌శ్చిమ ప్రాంతాన్ని ఖ‌లిస్థాన్ అదుపులోకి తీసుకుంటుంద‌ని.. ఆ ఆడియోలో పేర్కొంది ఖ‌లిస్ధాన్ అనుకూల గ్రూప్ సిఖ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ (ఎస్ఎఫ్‌జే)… ఈ ఘటనపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version