NTV Telugu Site icon

Stephen Miller: ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..

Miller

Miller

Stephen Miller: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అయితే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లోకి స్టీఫెన్ మిల్లర్ అనే వ్యక్తిని తీసుకున్నాడు. ఇతడిని ‘‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ ఫర్ పాలసీ’’ కోసం నియమించాడు. మిల్లర్ నియామకాన్ని వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన జేడీ వాన్స్ సోమవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘‘అధ్యక్షుడి మరో అద్బుతమైన ఎంపిక’’ అంటూ ప్రశంసించారు.

అయితే, స్టీఫెన్ మిల్లర్ ఎంపిక రాబోయే కాలంలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బంది కలిగించవచ్చు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీని గట్టిగా సమర్థించే వ్యక్తుల్లో మిల్లర్ ఒకరు. మిల్లర్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడి అయిన సమయంలో అతడి పాలనలో సీనియర్ సలహాదారుగా, స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇతను ‘ముస్లిం ప్రయాణ నిషేధం’, 2018లో ఫ్యామిలీ సపరేషన్ పాలసీ సహా ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్‌కి కీలక సలహాలు ఇచ్చాడు.

Read Also: Kakinada Subbayya Gari Hotel: సుబ్బయ్య గారి హోటల్‌ భోజనంలో జెర్రీ.. సీజ్‌ చేసిన అధికారులు

H-1B వీసాలపై మిల్లర్ వైఖరి:

మిల్లర్ 2024లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి తరుచుగా హాజరవుతూ వచ్చారు. ట్రంప్ ర్యాలీల్లో మాట్లాడారు. దాదాపుగా 19,500 మంది అమెరికన్లు హాజరైన న్యూయార్క్ మాడిసర్ స్వ్కేర్ గార్డెన్ ర్యాలీలో అమెరికన్లు ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘‘అమెరికా అమెరికన్లకు మాత్రమే’’,,‘‘ అమెరికాను నిజమైన అమెరికన్లలో పునరుద్ధరిస్తా’’ అంటూ హామీ ఇచ్చారు. వలసలపై, అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పకనే చెప్పాడు.

గతేడాది న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తిరిగి ఎన్నికైతే, అతని పరిపాలనలో చట్టపరమైన, అక్రమ వలసలను నియంత్రించే విధానాన్ని తీసుకువస్తామని మిల్లర్ చెప్పాడు. వలసదారుల్ని శిబిరాల్లో నిర్భందించే ప్రణాళిక గురించి కూడా అతను మాట్లాడాడు. ట్రంప్ మొదటి పరిపాలనలో మిల్లర్ క్రజ్-సెషన్స్ బిల్లును రూపొందించడంలో సహాయం చేశాడు, ఇది మాస్టర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు USలో కనీసం 10 సంవత్సరాల పాటు H-1B హోదాలో పని చేయకుండా నిషేధించింది.

ఇప్పుడు ట్రంప్ 2.0లో మిల్లర్ H-1B వీసాలపై పరిమితులతో సహా నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాలని కొనసాగిస్తాడని తెలుస్తోంది. H-1B ప్రోగ్రాం అమెరికన్ వర్కర్లు వేరే ప్రాంతాలకు వెళ్లేలా, వేతనాలు తక్కువగా వచ్చేలా చేస్తోందని అతను భావించాడు. నిజానికి ట్రంప్ హాయాంలో వీసా తిరస్కరణ రేటు పెరిగింది. ఈ పరిణామాలు రానున్న కాలంలో భారతీయులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.