Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story This Is The Background Of Al Falah University

Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Published Date :November 13, 2025 , 10:29 am
By Suresh Maddala
  • వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే
  • హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదని ఎంచాలని పెద్దలు అంటుంటారు. అసలు చెట్టే మంచిది కాదన్నప్పుడు కాయ ఎలా మంచిది అవుతుంది. కానే కాదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ప్రస్తుతం ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘‘అల్-ఫలాహ్ యూనివర్సిటీ’ పేరు. విశ్వవిద్యాలయం అంటే విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది. కానీ అల్-ఫలాహ్ యూనివర్సిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగానే డాక్టర్ల బృందం దేశ వ్యాప్త దాడులకు ప్రణాళికలు రచించారు. దీనికి ప్రధాన కారణం.. పునాది స్థాపకుడే ఒక పెద్ద విషవృక్షం. చెట్టే మంచిది కానప్పుడు కాయలు ఎలా మంచివి అవుతాయి. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోతే…

జావాద్ అహ్మద్ సిద్ధిఖీ..
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ (61).. ఇతడే అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ స్థాపకుడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లోనే ఈ యూనివర్సిటీ ఉంది. ‘‘అల్-ఫలాహ్’’ అంటే అరబిక్‌లో విజయం, శ్రేయస్సు అని అర్థం. ఇక జావాద్ నవంబర్ 15, 1964లో జన్మించాడు. హమ్మద్ అహ్మద్ సిద్ధిఖీకి పుట్టిన ముగ్గురు కుమారుల్లో జావాద్ ఒకడు. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో పెరిగాడు. ఇది భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలం. ప్రస్తుతం ఈ పట్టణం పేరు కూడా మార్చబడింది. ఇక జావాద్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్, ప్రొడక్ట్ డిజైన్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం జావాద్ కుటుంబం ఢిల్లీకి మకాం మారింది. ఇక 1993లో జామియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా జావాద్ పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడే అతగాడి కలలు పెరిగాయి. తన ఆశయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచించాడు.

1

జావాద్ లెక్చరర్‌గా పని చేస్తుండగా అల్-ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రారంభించాడు. కొద్దికాలంలోనే సంస్థ బహుగా పురోగతి సాధించింది. ఆయా ప్రాంతాల్లో డజను వెంచర్లు విస్తరించాయి. దీనికి జావాదే డైరెక్టర్, ఛానలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థులంతా జావాద్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. అంతగా పాపులరిటీని సాధించాడు. ఇక జావాద్.. జామియా నగర్‌లో ఒక విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అల్‌-ఫలా హౌస్‌గా పిలవబడే ఈ ఇంట్లోనే ప్రతి ఏడాది చాలా గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటాడు. ఈ ఏడాది కూడా చాలా గ్రాండ్‌గా వేడుకలు జరుపుకునేందుకు ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఢిల్లీ బాంబ్ పేలుడుతో యూనివర్సిటీ భండారం బయటపడింది.

9

ఇక జామియా నగరం కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని జావాద్ విస్తరించాడు. తన సోదరుడైన సౌద్‌తో కలిసి కొన్ని చిన్న కంపెనీలను కూడా స్థాపించాడు. ఇందులో ప్రధానంగా అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటి ఉంది. అయితే ఇందులో పెట్టుబడులు పెడితే అధిక రాబడి వస్తుందంటూ జావాద్ నమ్మ బలికాదు. దీంతో చాలా మంది పెట్టుబడులు కూడా పెట్టారు. అంతే ఇదే అదునుగా భారీ మోసానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా పెట్టుబడులన్నింటీని అపహరించాడు. దీంతో 2000లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో కేఆర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు (నం.43/2000) ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ కేసును ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసి జావాద్‌ను అరెస్ట్ చేసింది. సోదరుడు సౌద్‌తో కలిసి మూడేళ్లు జావాద్ జైల్లో ఉన్నాడు. 2023 మార్చిలో బెయిల్‌కు అప్లై చేసుకుంటే తిరస్కరణకు గురైంది. పెట్టుబడులను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తేల్చింది. చివరికి 2004లో బెయిల్ లభించింది. ఇక అంతలోనే 2005లో పాటియాలా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పెట్టుబడిదారులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిర్దోషిగా విడుదల చేసింది.

ఇక ఫరీదాబాద్‌లో స్థాపించిన కళాశాలను.. అనంతరం అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా 2019లో తరగతులు ప్రారంభం అయ్యాయి. చౌకగా వైద్య విద్యను అందించడంతో చాలా మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించారు. మైనారిటీ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఇక ఇందులో చదివిన కొంత మంది హిందు విద్యార్థులు కూడా ముస్లింలుగా మారారని.. హిజాబ్‌‌లు, బుర్ఖాలు ధరించడం వంటివి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కోవిడ్ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కరోనా సమయంలో నర్సులు జీవిత బీమా డిమాండ్ చేసినందుకు వెంటనే వారిని తొలగించేశారని ఆరోపణలు ఉన్నాయి. స్టైపెండ్‌లు చెల్లించకపోవడాన్ని నిరసించినందుకు మెడికల్ ఇంటర్న్‌లను కూడా సస్పెండ్ చేసేశారు.

యూనివర్సిటీ కేంద్రంగా అనేక దుర్మార్గాలు జరిగినట్లుగా అందులో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో ఈ భండారం వెలుగులోకి వచ్చింది. అయితే ఢిల్లీ బ్లాస్ట్‌ తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీ దుర్మా్ర్గాలు అనేకమైనవి వెలుగులోకి వచ్చాయి. ఈ యూనివర్సిటీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా వైద్యులు మారణహోమం సృష్టించాలని ప్రణాళికలు రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి. దర్యాప్తు సంస్థలు ముందుగానే అప్రమత్తం అవ్వడంతో ఈ కుట్ర కోణం బయటపడింది. లేదంటే దేశంలో మరిన్ని దాడులు జరిగుండేవి. ఎంతో మంది ప్రాణాలు పోయేవి. ఇంత పెద్ద కుట్రను ఛేదించిన దర్యాప్తు సంస్థలకు కచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Al Falah University
  • Al Falah University background
  • Chancellor jail
  • Delhi car blast
  • Jawad siddiqui shady

తాజావార్తలు

  • Spoiled Meat: హైదరాబాద్‌లోని హోటల్స్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా..? బాబోయ్..

  • Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..

  • BandMelam: సినిమా బాలేకున్నా “బ్యాండ్ మేళం” వాయించాలా?

  • IPL 2026: ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై.. ఈడీ కి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions