కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి కాస్త పరిస్థితి కుదుటపడుతుండగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. తాజాగా థర్డ్ వేవ్‌పై వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ).. కరోనా థర్డ్ వేవ్ తప్పదని.. అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ హెచ్చరించింది. ఓవైపు ఇలాంటి పరిస్థితులున్నా.. అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఐఎంఏ.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూశాం.. థర్డ్ వేవ్ తప్పదు. అయినా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారని.. కనీసం కరోనా నిబంధనలు పాటించకుండా వేడుకలు చేసుకుంటున్నారంటూ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు.. టూరిజం, తీర్థయాత్రలు, మత సంబంధమైన వ్యవహారాలు అవసరమే కానీ.. వాటిని మరికొన్ని నెలలు ఆపవచ్చని.. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇలాంటి వాటికి ప్రజలను అనుమతిస్తే వీళ్లే సూపర్ స్ప్రెడర్లుగా మారి కరోనా థర్డ్ వేవ్‌కు కారణమవుతారు అంటూ హెచ్చరించింది.
కరోనా థర్డ్ వేవ్.. ఐఎంఏ తాజా వార్నింగ్

IMA