Snakes Inside Door Frame: మహరాష్ట్రలోని గోండియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటన జరిగింది. ఓ ఇంటిలోని డోర్ ఫ్రేమ్ నుంచి 39 చిన్న పాములు బయటకు తీయడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్లు డోర్ ఫ్రేములో చెదులు ఉందని అప్పటిదాకా భావించారు. అయితే పాములను చూసి ఒక్కసారిగా భయపడ్డారు. ఈ పాములను పట్టుకునేవారు దాదాపుగా 4 గంటలు కష్టపడి పాములన్నింటిని పట్టుకున్నారు. సమీపంలోని అడవుల్లో వదిలారు.
Read Also: H3N8 Bird Flu: చైనాలో బర్డ్ ఫ్లూతో ఒకరు మృతి.. ప్రపంచంలోనే తొలి కేసుగా నమోదు..
ఇంటి యజమాని సీతారామశర్మ మాట్లాడుతూ.. ఇంటిని 20 ఏళ్ల క్రితం నిర్మించామని, తలుపులు, ఫ్రేములు చెదలు తినేశాయని అన్నారు. గతవారం పనిమనిషి శుభ్రం చేస్తున్న సమయంలో ఆమె ఓ చిన్నపామును చూసిందని, మరిన్ని పాములు కూడా కదులుతున్నట్లు గుర్తించిందని వెల్లడించారు. పాములను పట్టేవారిని పిలిస్తే, వారు డోర్ ఫ్రేము నుంచి 39 పాములను బయటకు తీసినట్లు వెల్లడించారు. పాములను ఓ జార్ లో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
అయితే, ఇంట్లో దొరికిన పాములు విషపూరితం కావని స్నేక్ క్యాచర్ బంటి శర్మ తెలిపారు. డోర్ ఫ్రేములోని చెదపురుగును ఈ పాములు తింటున్నాయని పాములు పట్టేవారు వెల్లడించారు. ఈ పాములన్నీ వారం క్రితమే పుట్టాయని, 7 అంగుళాల కన్నా తక్కువ పొడవు ఉన్నాయని వారు తెలిపారు.