Site icon NTV Telugu

Viral Video: ‘‘అది కడుక్కోవడానికి నీరు లేదు’’ .. పాక్‌ని దారుణంగా ట్రోల్ చేసిన అంకుల్..

London

London

Viral Video: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించుకుంది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్చి చంపాడాన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఇదిలా ఉంటే, ప్రపంచదేశాలు కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఉగ్రవాదం అణిచివేతలో భారత్‌కి సహకరిస్తామని చెప్పింది.

Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..

ఇదిలా ఉంటే, ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదులకు సంబంధించిన డిజిటల్ ఫుట్‌ ప్రింట్స్ పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్, కరాచీ నగరాల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. శనివారం, లండన్‌లో భారతీయ సమాజం పాకిస్తాన్ హైకమిషన్ ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయులకు ఇజ్రాయిలీలు కూడా మద్దతుగా నిలిచారు. భారత్, ఇజ్రాయిల్ జెండాలను పట్టుకుని పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు.

అయితే, ఈ నిరసనల్లో ఒక ‘‘అంకుల్ జీ’’ సెన్సేషన్‌గా మారారు. పాకిస్తాన్‌ని దారుణంగా ట్రోల్ చేశాడు. పాకిస్తాన్ రాయబార అధికారులు చూస్తుండగానే వారిని ఎగతాళి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌కి నీరు కష్టంగా మారింది. దీనిని ఉద్దేశించి, సదరు పెద్దాయన ‘‘మీకు కడుక్కోవడానికి కూడా నీరు లేవు, మీకు నీరు కావాలి’’ అని అర్థం వచ్చేలా ‘‘సింబాలిక్’’గా చూపిస్తున్న సన్నివేశం విస్తృతంగా వైరల్ అవుతోంది.

Exit mobile version