Supreame Court: రైలు ప్రయాణంలో దొంగతనం చేయడం రైల్వేకు సంబంధం లేదని, ఇది రైల్వే శాఖ సేవల్లో లోపం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్ బాధ్యత వహించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక వ్యాపారవేత్తకు రూ. 1 లక్ష చెల్లించాలని రైల్వేని ఆదేశించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఉత్తర్వును పక్కన పెడుతూ న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Nehru Museum Renamed: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా వివాదం..
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన నడుము బెల్టులో కట్టుకుని ఉన్న రూ. 1 లక్ష నగదు పోగొట్టుకున్నట్లు పేర్కొంటూ వ్యాపారవేత్త జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. తన నష్టాన్ని రైల్వే శాఖ భరించి, తనకు పరిహారం ఇవ్వాలని కోరాడు. ‘‘ఈ విధమైన దొంగతనాన్ని రైల్వే శాఖలో లోపంగా ఎలా చెప్పగలరో మేము అర్థం చేసుకోలేకపోతున్నాము.. ప్రయాణికుడు తన సొంత వస్తువలను రక్షించుకోలేకపోతే రైల్వే బాధ్యత వహిందని’’ ధర్మాసనం పేర్కొంది.
వ్యాపారవేత్ సురేందర్ భోలాకు రూ. 1 లక్ష చెల్లించాలని ఆదేశించిన ఎన్‌సిడిఆర్‌సి ఉత్తర్వుపై రైల్వేలు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. భోలా ఏప్రిల్ 27, 2005న కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి వెళ్తున్న సమయంలో తన నడుముకు బెల్టులో కట్టుకున్న లక్ష రూపాయలు చోరీకి గురయ్యాయి. ఆ డబ్బును వ్యాపారలావాాదేవీల కోసం దుకాణదారుడికి ఇవ్వాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొన్న సమయంలో బెల్టు కనిపించలేదు. దీనిపై ఢిల్లీలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
