NTV Telugu Site icon

Tamilnadu : బస్సుపై ఇంత ప్రేమా?.. మీ మనసు చాలా గొప్పది బాసూ..

Bus Driver Emotional

Bus Driver Emotional

మనుషులు, జంతువులే కాదు.. మనతో చాలాకాలం ప్రయాణం చేసిన వాహనాల మీద కూడా కొందరు అమితమైన ప్రేమను కురిపిస్తారు.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకొని అందంగా ముస్తాబు చేస్తూ మురిసిపోతారు.. ఇదంతా ఎందుకు చెప్తున్నారనే డౌట్ కదా.. ఓ వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు.. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేవరకు ఆ బస్సును తన బిడ్డలాగా చూసుకున్నాడు.. ఇక ఆ బస్సు నాది కాదు అనే ఆలోచన తనని కలచివేసింది.. ఆ బస్సు దగ్గరకు వెళ్లి ప్రేమగా ముద్దాడాదు.. తనతో మాట్లాడాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

 

ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలో ముత్తుపాండి పరదవీ విరమణ పొందారు. ఎంతో కాలంగా తను నడిపిన సంస్థ బస్సుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. 60 ఏళ్ల ముత్తుపాండి డ్రైవర్ గా బస్సును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రయాణీకుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు పంపేవారు. కానీ 60 ఏళ్లు వచ్చాయి. ఇక ఈ సంస్థ బస్సులతో రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. పదవీవిరమణ సందర్భంగా ముత్తుపాండి చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెడుతున్న భావోద్వేగం అయ్యాడు..

 

అతను ఇక బస్సు ఎక్కను అనే మాటను తలచుకుంటూ స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోంచి కిందికి దిగారు.. ఆ తర్వాత బోర్డుకు కూడా దండం పెట్టి ముద్దు పెట్టుకున్నాడు.. దాన్ని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని కంటతడి పెట్టుకున్నాడు.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..