స్టాలిన్ సర్కార్ తమిళనాడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ర్ట ఆర్థికాభివృద్ధి కోసం పలు కీలక ప్రాజెక్టులను రాష్ర్టానికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ సంఖ్యను తగ్గించారు. రాజకీయ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడితే వారి పైన కఠిన చర్యలు తీసుకొనున్నట్టు తెలిపారు. రాష్ర్టంలో కోవిడ్ సెంకడ్ వేవ్‌ను తమిళనాడు ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. ఇండస్ర్టీయల్ పాలసీలో కూడా నూతన మార్పులను తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలోనూ సరికొత్త మార్పులను తీసుకొచ్చింది.
ఆసియాలో ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ విధానాన్ని తీసుకు రావడంతో ప్రముఖ పరిశ్రమలను స్థాపించడానికి ఆహ్వనించింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో ఎవరైనా ఉద్యోగాలు పొందాలనుకుంటే అందుకోసం నిర్వహించే తమిళ భాషలో ఖచ్చితంగా 40 శాతం మార్కులను పొందడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు జీవో జారీ చేస్తున్నట్లు తమిళనాడు రాష్ర్ట ఆర్థిక మంత్రి తయగరాజన్ తెలిపారు.
