Site icon NTV Telugu

వ్యవసాయ రంగంలో పెరిగిన కార్మికుల సంఖ్య

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు గురువారం రాజ్యసభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్‌ 2020 మధ్య నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా,

అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గినట్లు తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తితో వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు తరలి పోవడం, లాక్‌డౌన్‌ వలన కర్మాగారాలు తాత్కాలికంగా మూతపడటం ఇందుకు కారణాలుగా మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version