Site icon NTV Telugu

Leopard: చిరుతను తాడుతో బైకుకు కట్టి.. ఫారెస్ట్‌ ఆఫీసుకు తీసుకెళ్లిన రైతు

Leopard

Leopard

Leopard: పులిని చూస్తే భయపడి ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది చిరుత పులే మనపై దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ తనపైకి దాడికి వచ్చిన చిరుత పులితో పోరాడి.. ఆ చిరుతనే బంధించాడో వ్యక్తి్. చిరుతను బంధించి తాడుతో కట్టి.. తన బైక్‌పై అటవీ శాఖ ఆఫీస్‌కు వెళ్లి అధికారులకు అప్పగించి వచ్చాడు ఆ వ్యక్తి. కర్ణాటకలోని హసన్‌ జిల్లా బాగివాలు గ్రామానికి చెందిన ముత్తు అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 9 నెలల వయస్సున్న చిరుత పులి ఎదురుపడింది. మరి అది ఊకుంటుందా.. అతడిపై దాడికి దిగింది. అయితే తానేం తక్కువ అనుకున్నాడో ఏమో.. దానిపై ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న తాడుతో దానిని బంధించాడు. దాని కాళ్లను తాడుతో కట్టేశాడు. చిరుతను తన బైక్‌కు వెనక కట్టుకుని ఏకంగా అటవీ ఆఫీస్‌కు తీసుకెళ్లి అధికారులకు అప్పజెప్పాడా రైతు.

Read also: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు

రైతు చిరుత పులిని తాడుతో బంధించి బైక్‌పై తీసుకురావడాన్ని చూసి విస్తుపోయిన సిబ్బంది వెంటనే దానిని దవాఖానకు తరలించారు. చిరుత దాడిలో రైతు ముత్తు స్వల్పంగా గాయపడ్డాడు. చిరుత పులి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతోనై రైతు అలా చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. అతనికి మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులు రైతుకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత వదిలేసినట్లు పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని రైతుకు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిపై దాడి చేసి.. దానిని తాడుతో కట్టేశానని ముత్తు తెలిపాడని అధికారులు చెప్పారు. తనకు చిరుతను చంపాలనో.. మరో ఉద్దేశం ఏమీలేదని రైతు స్పష్టం చేశాడు.

Exit mobile version