Central IT Department: ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు పెరిగిన సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను, ఫోటోలను సృష్టి స్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళ పైశాచికతకు ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి డీఫ్ ఫేక్ కంటెంట్ వ్యవహారం ఇంటర్నెట్‌లో చాలా కాలంగా ఉంది. అయితే తాజాగా నటి రష్మిక మందన్న వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఆ వెంటనే పలువురు ప్రముఖులకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
Read also:Vishnupriya Bhimeneni: హాఫ్ శారీలో విష్ణు ప్రియ అందాల జాతర
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సమావేశం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం జరిగే సమావేశంలో మార్ఫింగ్ కంటెంట్(ఫొటోలు, వీడియోలు) అంశాల కట్టడిపై, శుక్రవారం జరిగే భేటీలో ఐటీ నిబంధనలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి కట్టడికి అవసరమైతే కొత్త చట్టం తెస్తామని ప్రకటించారు. ఈ క్రమం లో కేంద్రం చట్టం రూపకల్పన, ఇతరత్రా అంశాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలుస్తుంది.