Uttar Pradesh: ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకు పెళ్లిళ్లు ఆగిపోతుండటం చూశాం. చీర నచ్చకపోవడం, మేకప్ సరిగ్గా లేకపోవడం వంటి చిన్న కారణాల కారణంగా గతంలో వివాహాలు చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో వరుడు, వధువు బంధువులు తప్పతాగి రావడం మూలంగా పెళ్లిళ్లు చెడిపోయాయి. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మూహూర్తం సమయానికి తప్పతాగి పెళ్లి మండపానికి వచ్చాడు వరుడు. దీంతో పెళ్లి కూతురు వివాహాన్ని రద్దు చేసుకుంది.
Read Also: President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లా మాణిక్ పుర్ లో ఘటన జరిగింది. ముహూర్తం సమయానికి వరడు తాగి వచ్చి, వధువుపై సిందూరం చల్లాడు. దీంతో యువతి పెళ్లి మండపంలోనే వివాహానికి నిరాకరించింది. శుక్రవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వధూవరులు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో పెళ్లికొడుకు మద్యం తాగాడు. తాగిన మైకంలో వధువుకు బోట్టు కూడా పెట్టలేకపోయాడు.. వధువుపై సిందూరాన్ని చల్లడం ప్రారంభించాడు. ఆపే ప్రయత్నం చేసిన వధువుపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో వధువు వివాహానికి నిరాకరించింది. ఈ ఘటన తర్వాత ఇరువర్గాలు పోలీసుల్ని ఆశ్రయించాలి. వివాహ ఖర్చులను చెల్లించడానికి వరుడి కుటుంబం అంగీకరించింది.
