NTV Telugu Site icon

Banshi Narayan Mandir: ఆ దేవాలయం ఏడాదిలో ఒక్క రోజే తెరచుకుంటుంది.. ఎప్పుడంటే!

Banshi Narayan Mandir

Banshi Narayan Mandir

Banshi Narayan Mandir: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో దేవాలయాలు ఒకటిగా ఉంటున్నాయి. దేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. దేవాలయాలకు వెళ్లి దేవుడిని పూజించి పనులకు వెళ్లడం సంప్రదాయంగా వస్తుంది. అయితే కొన్ని దేవాలయాలు కొన్నింటికి ప్రత్యేకంగా ఉంటాయి. అలా ఉండే వాటిలో ఉత్తరాఖండ్‌లోని దేవాలయం కూడా ఒకటి, ఆ దేవాలయం ఏడాదిలో ఒక్క రోజే తెరచుకుంటుంది. అదీ ఎప్పుడంటే కేవలం రక్షా బంధన్‌(రాఖీ పౌర్ణమి) రోజున మాత్రమే తెరచుకుంటుంది.

Read Also: Weight Gain : బరువు పెరగాలనుకుంటున్నారా..? అయితే.. ఇవి మీకోసమే

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బన్షీ నారాయణ్ ఆలయం దేవాలయం ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదని.. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణుమూర్తి మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు. దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బన్షీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే.. సుమారు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే.. విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాది మొత్తం మూసేసి ఉన్న గుడి కాస్త.. ఒక్క రక్షా బంధన్‌ రోజు మాత్రమే తెరచుకుని భక్తులకు కనువిందు చేస్తుంది.