Site icon NTV Telugu

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

Jk Encounter

Jk Encounter

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భద్రతా దళాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరిని హతమార్చారు. తాజాగా సోమవారం కూడా జేకే కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. గుడార్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం అందడంతో భద్రతా దళాలు మోహరించాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే ఒక ఆర్మీ జవాన్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు

ఇక ఆదివారం అర్ధరాత్రి జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక పాకిస్థాన్ చొరబాటుదారుడిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. చొరబాటుదారుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ నివాసి సిరాజ్ ఖాన్‌గా గుర్తించారు. రాత్రి 9:20 గంటలకు చొరబాటుకు యత్నిస్తుండగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోకి చొరబడటానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Trump: మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు.. ట్రంప్‌తో కీలక భేటీ!

 

Exit mobile version