Site icon NTV Telugu

Radhika Yadav: హత్యకు గురైన టెన్నిస్ స్టార్ తండ్రి సంపాదన నెలకు రూ. 17 లక్షలు.

Radhika Yadav

Radhika Yadav

Radhika Yadav: 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ హత్య సంచలనంగా మారింది. సొంత తండ్రి కూతురిని కాల్చి చంపాడు. ఘటన సమయంలో ఇంట్లో రాధికాయాదవ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తోంది. ఈ సమయంలోనే వెనక నుంచి కాల్చి చంపాడు. అయితే, కూతురి ఆదాయంపై ఆధారపడుతున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో, ఆమె తండ్రి 49 ఏళ్ల దీపక్ యాదవ్ ఆర్థిక పరిస్థితి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గురువారం గురుగ్రామ్ లోని విలాసవంతమైన సుశాంత్ లోక్ ప్రాంతంలో ఇంటిలోనే కాల్చి చంపారు. తానే నేరం చేసినట్లు దీపక్ యాదవ్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఇతను కస్టడీలో ఉన్నాడు. నెలకు రూ. 15 లక్షల నుంచి 17 లక్షల సంపాదన దీపక్ యాదవ్ కు ఉంది. విలాసవంతమైన ఫామ్ హౌజ్ కూడా ఉంది. అలాంటి వ్యక్తి కూతురు సంపాదనపై ఆధారపడుతున్నాడనే వాదనల్ని ఆయనకు పరిచయస్తులు కొట్టిపారేశారు. గురుగ్రామ్ ప్రాంతంలో అనేక ఆస్తులు ఉన్నట్లు తేలింది. వజీరాబాద్ గ్రామంలో ప్రతీ ఒక్కరికి దీపక్ యాదవ్ ధనవంతుడు అని తెలుసు.

Read Also: Siddaramaiah: నాయకత్వ మార్పు లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. జర్నలిస్టులపై సిద్ధరామయ్య రుసరుసలు

దీపక్ వద్ద లైసెన్సుడ్ 32 బోర్ రివాల్వర్ ఉంది. సరైన కాంటాక్ట్స్, డబ్బు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ తరహా లైసెన్సులను నిర్వహించగలరని, సామాన్యులకు ఈ అవకాశం ఉండదని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. రాధిక ఆర్థిక స్వాతంత్య్రం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, దీపక్‌ని బాధపెట్టినట్లు తెలుస్తోంది. దీపక్, కూతురు సంపాదనపై ఆధారపడుతున్నాడనే వాదనల్ని పలువురు తోసిపుచ్చారు. ఇంత డబ్బు ఉన్న వ్యక్తి కూతురు సంపాదనపై ఎందుకు ఆధారపడుతారని ప్రశ్నిస్తున్నారు.

దీపక్ తన కూతురికి టెన్నిస్ నేర్పించడానికి చదువు కూడా వదులు కున్నాడు. తన కూతురికి రూ.2 లక్షల విలువైన టెన్నిస్ రాకెట్లు కొన్నాడు. తన కూతురిని చాలా ప్రేమిస్తాడని, హత్య వెనక టెన్నిక్ కారణాలు కాకుండా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని చెబుతున్నారు.

Exit mobile version