NTV Telugu Site icon

Mulayam Singh Yadav: ముగిసిన ములాయం సింగ్ అంత్యక్రియలు.. హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్

Kcr

Kcr

Mulayam Singh Yadav: ఉత్తర ప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని సైఫయా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ములాయం భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Read Also: High Court: రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ కేసు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

మరోవైపు ములాయం అంత్యక్రియలు ముగిసిన తర్వాత కేసీఆర్ సైఫయా నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం చేసిన త‌ర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో ప‌లువురు జాతీయ నాయ‌కులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Kcr 2