Site icon NTV Telugu

Tecno Spark 9: బడ్జెట్ ధరలో మరో కొత్త ఫోన్.. ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!

Tecno Spark 9 Smartphone

Tecno Spark 9 Smartphone

Tecno Spark 9 Smartphone Launched With 11GB Ram: స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లదే హవా నడుస్తుండటంతో, కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు అధునాతన ఫీచర్స్‌తో తక్కువ ధరల్లోనే స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టెక్నో కంపెనీ బడ్జెట్ రేంజ్‌లో ఓ కొత్త మోడల్‌ని సోమవారం లాంచ్ చేసింది. రూ. 10 వేలలోపు ధరతో వచ్చిన ఈ ఫోన్‌లోని ఫీచర్స్ చూస్తే.. ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే!

టెక్నో స్పార్క్ 9 (Tecno Spark 9) పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6జీబీ ఫిజికల్ ర్యామ్, 5జీబీ వర్చువల్ ర్యామ్ కలిపి.. మొత్తంగా 11జీబీ వరకు ర్యామ్‌ ఈ ఫోన్‌లో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ మొబైల్ ధర కేవలం రూ. 9,499గా ఉంది. ఇన్ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ కలర్స్‌లో ఈ Tecno Spark 9 స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది. ఓటీఏ (OTA) అప్‌డేట్‌ చేసుకున్న తర్వాత ఈ ఫోన్‌లోని వర్చువల్ ర్యామ్ ఫీచర్ వస్తుందని టెక్నో సంస్థ పేర్కొంది.

ఈ మొబైల్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం ముందుభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్.. స్టాండర్డ్ 10వాట్ల చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డీటీఎస్ సపోర్ట్ చేసే స్పీకర్‌ను కూడా ఈ మొబైల్‌ కలిగి ఉండటం విశేషం.

Exit mobile version