Site icon NTV Telugu

Aaditya Thackeray: సమాజ్‌వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..

Aaditya Thackeray

Aaditya Thackeray

Aaditya Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ పనిని చేసినందుకు గర్విస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో చిచ్చు పెట్టింది. కూటమిలో మిత్రపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ కూటమి నుంచి వైదొలిగింది.

Read Also: Minister Seethakka: అర్బన్ నక్సలైట్స్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క భావోద్వేగం..

అయితే, ఈ రోజు శివసేన ఉద్ధవ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. ఎస్పీ నాయకుడు అబు అజ్మీ కొన్ని సార్లు ‘‘బీజేపీ బీ టీమ్’’లాగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. తన వ్యాఖ్యలు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ని ఉద్దేశించి కాదని స్పష్టతనిచ్చాడు. అఖిలేజ్ జీ పోరాడుతున్నాడు, కానీ ఇక్కొ కొన్నిసార్లు బీజేపీ బీ టీమ్‌లా ప్రవర్తిస్తున్నారని, ఇది ఇంతకుముందు మనం చూశామని ఆయన అన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేతను పొగిడే వారితో మేం ఎందుకు ఉండాలి.. ఇలాంటి వారికి బీజేపీకి తేడా ఏంటని ఎమ్మెల్యే అబు అజ్మీ ప్రశ్నించారు. తాము కూటమి నుంచి వెళ్లిపోతున్నామని, ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్‌కి కూడా చెప్పామని వెల్లడించారు. దీనిపై ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘మన హిందుత్వం స్పష్టంగా ఉంది, మేము హిందుత్వవాదులం కాని మేము ఎప్పుడూ చెప్పలేదు. మన హిందుత్వ హృదయంలో రాముడు, చేతిలో పని ఉంది. మా హిందుత్వం అందరిని సమానం చూస్తుంది. బీ టీమ్‌లు మాకు నేర్పకూడదు. మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే అందరిని కలిపి ముందుకు నడిపిస్తారు.’’ అని అన్నారు.

Exit mobile version