Site icon NTV Telugu

తరుముతున్న తుఫాన్: మరో 12 గంటల్లో..

ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనిస్తుండడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ తో కేరళ వణికిపోతుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ ప్రభుత్వం. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాదు 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లుగా తెలిపింది. ముంబైకి భారీ వర్ష సూచన కాగా.. తెలుగు రాష్ట్రాల్లోను ఇవాళ, రేపు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Exit mobile version