Swamiji’s fight: ప్రజలకు సద్భుద్ధులు చెప్పాల్సిన స్వామీజీలే కొట్టుకున్నారు. నువ్వు గొప్ప అంటే లేదు నేనే గొప్ప అంటూ ఇద్దరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో సంచలనంగా మారింది. ఇద్దరు స్వామీలు కొట్టుకున్న వీడియో తమిళనాడులో వైరల్ గా మారింది. వీరిద్దరి గొడవ సింగపూర్ లో జరిగింది. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామీజీ రోగాలు నయం చేయడంలో ఫేమస్.
Read Also: Nellore Incident: నెల్లూరు జైలు దగ్గర దారుణం.. కత్తితో దాడి
ఈ నేపథ్యంలో తన తండ్రి ఆరోగ్యాన్ని నయం చేయడానికి సింగపూర్ రావాలని ఓ భక్తుడు కోరాడు. దీంతో ఆయన సింగపూర్ వెళ్లారు. భక్తుడి ఇంటికి వెళ్లే సమయానికి సింగపూర్ కు చెందిన హల్క్ స్వామీజీ ఉన్నారు. ఇద్దరు కూడా భక్తున్ని ఆశీర్వదించిన తర్వాత అసలు కథ మొదలైంది. ఇద్దరు స్వామీజీల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరు కూడా నేను గొప్పంటే.. నేను గొప్ప అంటూ వాగ్వాదాన్ని మొదలుపెట్టి చేయి చేసుకునే వరకు తీసుకెళ్లారు. ఆగ్రహంతో రాజ్ కుమార్ స్వామీజీ గొంతు పట్టుకుని.. గుడ్డలు విప్పి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు హల్క్ స్వామీజీ. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
